ఈ స్టాక్‌లో అప్పట్లో రూ.10 వేలు పెట్టిన మదుపర్లు ఇప్పుడు రూ.10.3 కోట్లకు అధిపతులయ్యారు
- రాకెట్‌లా పైపైకి దూసుకెళ్తున్న చిప్‌ల తయారీ కంపెనీ ‘ఎన్విడియా’ షేర్లు
- 1999లో కంపెనీ ఐపీవో.. నాటి ఒక షేర్ ఇప్పుడు 480 షేర్లు
- ఐపీవోలో 12 డాలర్లుగా ఉన్న షేర్ విలువ నేడు 135 డాలర్లకు పెరుగుదల
- మిలియనీర్లుగా మారిపోయిన ఇన్వెస్టర్లు
స్టాక్ మార్కెట్‌లో కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల పంట పండిస్తుంటాయి. విలువైన పెట్టుబడి పెట్టి ఓపికతో ఎదురుచూసిన మదుపర్లను సంపన్నులు చేస్తుంటాయి. అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ దిగ్గజ కంపెనీ ‘ఎన్విడియా’ కూడా ఈ కోవకే చెందుతుంది. ఏఐ, రోబోటిక్స్, అటానమస్ వెహికల్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికత పరికరాలలో ఉపయోగించే పలురకాల చిప్‌లను తయారు చేస్తున్న ఈ కంపెనీ షేర్లు అమాంతం ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా ఏఐకి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్విడియా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఈ షేర్ ధర 3 శాతం మేర వృద్ధి చెంది 135.58 డాలర్ల వద్ద స్థిరపడింది.
కాగా ఎన్విడియా కంపెనీ 1999లో ఐపీవో ద్వారా అమెరికా స్టాక్ మార్కెట్‌లలో లిస్టింగ్ అయింది. నాడు ఈ కంపెనీలో రూ.10 వేల పెట్టుబడి పెట్టినవారు నేడు మిలియనీర్లుగా మారిపోయారు. పది వేల పెట్టుబడి కాస్తా ఏకంగా సుమారు రూ.10.3 కోట్లుగా వృద్ధి చెందింది.
ఎన్విడియా ఐపీవో సమయంలో ఒక్కో షేర్ ధర 12 డాలర్లుగా ఉంది. నాటి ఒక్క షేర్ ప్రస్తుతం 480 షేర్లుగా స్ప్లిట్ అయింది. అంటే అప్పుడు రూ.10 వేలతో కొన్న షేర్ల సంఖ్య ఇప్పుడు 9,120కి పెరిగింది. ఒక్కొక్క స్టాక్ విలువ దాదాపు 135.58 డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో (మారకపు విలువ రూ.83.40) సుమారు రూ.10.3 కోట్లుగా ఉంది. అంటే నాడు రూ.10 వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనవారంతా ఇప్పుడు మిలియనీర్లుగా మారిపోయారు.
కాగా ఎన్విడియా షేర్లు మంగళవారం దాదాపు 3 శాతం మేర వృద్ధి చెందడంతో కంపెనీ సీఈవో జాన్సన్ హువాంగ్ సంపద ఒకే రోజు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33.4 వేల కోట్లు) మేర పెరిగి 119 బిలియన్ డాలర్లకు చేరింది.