కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలున్నాయి: ఈడీ

  • కేజ్రీవాల్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచిన అధికారులు
  • ఎన్నికల సమయంలో అరెస్ట్ వెనుక దురుద్దేశం ఉందన్న కేజ్రీవాల్ న్యాయవాది
  • కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి ముందే ఆధారాలు సేకరించామన్న ఈడీ
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ బుధవారం కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు.

పీఎంఎల్ఏ కింద ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో కూడా ఆయనను నిందితుడిగా పేర్కొనలేదన్నారు. కిందికోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మే 10న సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. అయితే డబ్బులు తీసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆయనను అరెస్ట్ చేయడానికి ముందే ఆధారాలు సేకరించినట్లు తెలిపింది.


More Telugu News