వదిన బహుమతిగా ఇచ్చిన పెన్నుతోనే డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తొలి సంతకం
- ఉపముఖ్యమంత్రిగా ఉదయం బాధ్యతలు చేపట్టిన జనసేనాని
- ఇటీవల ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చిన వదిన సురేఖ
- పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపిన పలువురు మంత్రులు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపైనా, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపైనా ఆయన తొలుత సంతకాలు చేశారు.
తన వదిన సురేఖ ఇచ్చిన ఖరీదైన పెన్నుతోనే... ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ సంతకాలు చేశారు. పవన్ కల్యాణ్ కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు వదిన ఆయనకు ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు. జనసేనానికి పెన్నును గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌ను పలువురు మంత్రులు కలిసి అభినందనలు తెలిపారు. వీరిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు.