గ‌త ప్ర‌భుత్వ ప‌దేళ్ల పాల‌న‌లో జ‌ర్న‌లిస్టుల‌కు చేసిందేమీలేదు: తెలంగాణ మంత్రి పొంగులేటి

  • ఖ‌మ్మంలో ఘ‌నంగా టీయూడ‌బ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర‌ తృతీయ మ‌హాస‌భ‌లు
  • ఈ మ‌హాస‌భ‌ల‌కు మంత్రి పొంగులేటి, మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ శ్రీనివాస్ రెడ్డి హాజ‌రు
  • తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో జ‌ర్న‌లిస్టుల పాత్ర మ‌రువ‌లేనిద‌న్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌న్న మంత్రి  
ఖ‌మ్మంలో టీయూడ‌బ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర‌ తృతీయ మ‌హాస‌భ‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ మ‌హాస‌భ‌ల‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ శ్రీనివాస్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నేత‌లు, జ‌ర్న‌లిస్టులు ఇటీవ‌ల క‌న్నుమూసిన‌ మీడియా మొఘ‌ల్ రామోజీరావుకు ఘ‌న నివాళి అర్పించారు. 

అనంత‌రం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో జ‌ర్న‌లిస్టుల పాత్ర మ‌రువ‌లేనిద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ ప‌దేళ్ల పాల‌న‌లో జ‌ర్న‌లిస్టుల‌కు చేసిందేమీలేద‌ని విమ‌ర్శించారు. గతంలో హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన ఇళ్ల స్థ‌లాల‌ను అతి త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌న్నారు. 

అలాగే ఖ‌మ్మం జిల్లా జ‌ర్న‌లిస్టుల‌ ఇళ్ల స్థలాల స‌మ‌స్య‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇక అక్రిడేష‌న్ కార్డులు మ‌రో మూడు నెల‌లు పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు. హెల్త్ కార్డుల అంశంపై ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామన్నారు. జ‌ర్న‌లిస్టుల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ అన్ని విధాలుగా అండగా ఉంటుంద‌ని మంత్రి పొంగులేటి చెప్పారు.


More Telugu News