తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరం: కూనంనేని సాంబశివరావు
- తెలంగాణలో బీఆర్ఎస్ బతికే ఉండాలని వ్యాఖ్య
- తన పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ కృషి చేయాలని సూచన
- రేవంత్ రెడ్డి అన్ని పార్టీల సహకారంతో పాలన సాగించాలని సూచన
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని... ఆ పార్టీ బతికే ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తన పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ కృషి చేయాలని సూచించారు.
తాము ప్రభుత్వంలో భాగమైనప్పటికీ ఉద్యమాలు, పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల సహకారంతో పాలన సాగించాలని సూచించారు.
ప్రధాని నరేంద్రమోదీపై కూనంనేని తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదని అన్నారు. పదవి కోసం దిగజారుతారన్నారు. 400 సీట్లు గెలుస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు అధికారం కోల్పోయే దశకు చేరుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలు సిద్ధాంతాలు మరిచాయని విమర్శించారు. ఇతర పార్టీలను చేర్చుకుంటూ అధికారం చేజిక్కించుకున్నాయని ధ్వజమెత్తారు.