వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీ పోటీపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

  • కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని రాజీవ్ చంద్రశేఖర్ విమర్శ
  • ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులు వస్తున్నారని మండిపాటు
  • ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం దాచి మరో స్థానం నుంచి పోటీ చేశారని ఆగ్రహం
  • 2014లో మోదీ వడోదర ప్రజలను మోసం చేశారా? అని కాంగ్రెస్ ప్రశ్న
ప్రియాంకగాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారనే వార్తలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. రెండోస్థానం నుంచి పోటీ చేయడం ద్వారా కుటుంబసభ్యులను వయనాడ్ ప్రజలపై రుద్దుతుండటం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేస్తుండటం వల్లే కాంగ్రెస్ పార్టీ... రాహుల్ గాంధీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఒకేసారి రెండుచోట్ల నుంచి పోటీ చేయడాన్ని ప్రశ్నించారు. ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం దాచి మరో స్థానం నుంచి పోటీ చేశారని విమర్శించారు.

బీజేపీ నేత వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఏం చేశారో గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. 2014లో మోదీ వారణాసి నుంచి పోటీ చేసే విషయం వడోదర ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. అంటే అప్పుడు మోదీ ఓటర్లను మభ్యపెట్టారా? అన్నది చెప్పాలని నిలదీశారు.


More Telugu News