మీరు గెలిస్తే ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా.... లేకపోతే పనిచేయనట్టా?: నారా లోకేశ్
- ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై జగన్ సందేహాలు
- జగన్ ట్వీట్ పై మండిపడుతున్న టీడీపీ నేతలు
- 2019లో ఈవీఎంలు భేష్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియో పంచుకున్న లోకేశ్
ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై మాజీ సీఎం జగన్ సందేహాలు లేవనెత్తుతూ ట్వీట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఈవీఎంల పనితీరు భేష్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ నేతలు షేర్ చేస్తూ, వైసీపీ తీరును ఎండగడుతున్నారు.
తాజాగా, ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. "ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్. మీకు ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటైన సంస్థలు, వ్యవస్థలు, వేదికలను మీరు క్రమంగా నాశనం చేస్తూ వచ్చారు. ఏపీ ప్రజలు ఏళ్ల తరబడి సమష్టి కృషితో నిర్మించుకున్నవాటిని మీరు ఒక్క దెబ్బతో కూల్చేశారు.
మీరు 2019లో గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా...! ఇప్పుడు మీరు 2024లో ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా...! ఎంతటి నయవంచన! మీరు మీ పదవీకాలంలో విఫలమయ్యారని, అందుకే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారని ఇకనైనా మీరు గుర్తిస్తే బాగుంటుంది.
అన్నట్టు... ఫర్నిచర్ ను తిరిగి ఎప్పుడు అప్పగిస్తున్నారు? పేదల కోసం ఉపయోగించాల్సిన రూ.560 కోట్ల డబ్బును మీ రుషికొండ ప్యాలెస్ కోసం ఎందుకు ఖర్చుపెట్టారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారు" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.