ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలో మార్పు... ఈ నెల 21 నుంచే సమావేశాలు

  • తొలుత ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు అని ప్రకటన
  • అసెంబ్లీ సమావేశాల తేదీని మార్చిన కూటమి ప్రభుత్వం
  • ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరుగుతాయని తొలుత పేర్కొన్నారు. ఇప్పుడా తేదీలో మార్పు చేశారు. ఈ నెల 21 నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారని తెలుస్తోంది. 

రెండ్రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని ఎన్నుకోవడం లాంఛనమే. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఎవరన్నది తేలాల్సి ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News