టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.. 27 బంతుల్లోనే శతకం బాదిన సాహిల్ చౌహాన్!
- ఐపీఎల్‌లో గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ సెంచరీ (30 బంతుల్లో) రికార్డు బ్రేక్
- అంతర్జాతీయ టీ20ల్లో జాన్ నికోల్ (33 బంతుల్లో 100) రికార్డును అధిగమించిన సాహిల్
- మొత్తం 41 బంతుల్లోనే 144 పరుగులు
- సాహిల్ చౌహాన్ ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు
యూరప్ దేశం ఈస్టోనియా బ్యాటర్ సాహిల్ చౌహాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సైప్రస్ జట్టుతో సోమవారం జరిగిన రెండో టీ20 మ్యాచులో సాహిల్ టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన శతకం బాదాడు. ఈ మ్యాచులో సాహిల్ కేవలం 27 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో కరేబియన్ ప్లేయర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ సెంచరీ (30 బంతుల్లో) రికార్డును అధిగమించాడు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గేల్ ఈ వేగవంతమైన శతకం నమోదు చేశాడు.
అలాగే అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ (33 బంతుల్లో 100) రికార్డును కూడా సాహిల్ చౌహాన్ బద్దలుకొట్టాడు. ఈ మ్యాచులో సాహిల్ 41 బంతుల్లో 144 పరుగులు చేశాడు. అందులో 18 సిక్స్లు ఉన్నాయి. ఇక సాహిల్ విధ్వంసానికి ఈస్టోనియా 192 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే అందుకుంది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతర్జాతీయ ఫాస్టెస్ట్ సెంచరీలు..
సాహిల్ చౌహాన్ (ఈస్టోనియా)- 27 (బంతుల్లో)
జాన్ నికోల్ (నమీబియా) - 33
కుశాల్ మల్ల (నేపాల్)- 34
డేవిడ్ మిల్లర్ (సౌతాఫ్రికా)- 35
రోహిత్ శర్మ (భారత్)- 35