చంద్రబాబు అరెస్టయిన సమయంలో ఆయన ఫ్యామిలీ పడ్డ బాధ కళ్లారా చూశా: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టులనూ అభివృద్ధి చేస్తానన్న రామ్మోహన్ నాయుడు
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామన్న కేంద్రమంత్రి
- చంద్రబాబుకు న్యాయం చేయడానికే దేవుడు అఖండ విజయాన్ని ఇచ్చాడని వ్యాఖ్య
ఎన్‌డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైపే దేశం మొత్తం చూస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అన్ని శాఖల నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు తనతో చెప్పారని ఆయన అన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని ఎయిర్‌పోర్టులనూ అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తానన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాకు తొలిసారిగా వచ్చారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. "కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోదీ పిలిపించి కీలకమైన విమానయాన శాఖను నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పారు. భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. చంద్రబాబు అరెస్టయిన సమయంలో ఆయన ఫ్యామిలీ పడిన బాధ కళ్లారా చూశాను. దేవుడు ఆయనకు న్యాయం చేయడానికే అఖండ విజయాన్ని ఇచ్చాడు" అని మంత్రి చెప్పుకొచ్చారు.