మాజీ సీఎం జగన్‌కు భారీ స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ

  • తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాల‌యానికి 30 మంది సెక్యూరిటీ సిబ్బంది 
  • అధికారం కోల్పోవడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జ‌గ‌న్‌కు భద్రత కుదించే అవ‌కాశం 
  • ఈ నేప‌థ్యంలోనే ఆయన ప్రైవేటుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న వైనం
ఏపీ మాజీ సీఎం జగన్‌ ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియ‌మించుకున్న 30 మంది సిబ్బంది సోమ‌వారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చారు. అధికారం కోల్పోవడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ పరంగా జగన్‌కు భద్రత కుదించే అవ‌కాశం ఉండ‌డంతో ఆయన ప్రైవేటుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. 

ఇకపై జ‌గ‌న్ మాజీ సీఎంగా, సాధార‌ణ ఎమ్మెల్యేగా మాత్ర‌మే కొన‌సాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయ‌న భ‌ద్ర‌తలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముంద‌స్తుగా జ‌గ‌న్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. గ‌తంలో కూడా జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు, పాద‌యాత్ర స‌మ‌యంలో ప్రైవేటు భ‌ద్ర‌తా సిబ్బందిని భారీ మొత్తంలో నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే. కాగా, జ‌గ‌న్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు, త‌న ఫ్యామిలీకి భ‌ద్ర‌త కోసం స్పెష‌ల్ సెక్యూరిటీ గ్రూపును ఏర్పాటు చేస్తూ ఒక ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.


More Telugu News