ఈవీఎం హ్యాకింగ్ ఎలా చేస్తారో నిరూపించేందుకు మస్క్ కు అవకాశం ఇవ్వాలి: పురందేశ్వరి

  • ఈవీఎంల వాడకాన్ని బహిష్కరించాలంటున్న ఎలాన్ మస్క్
  • హ్యాకింగ్ చేసే వీలుందని ఆందోళన
  • కేంద్ర ఎన్నికల సంఘం ఎలాన్ మస్క్ ను ఆహ్వానించాలన్న పురందేశ్వరి
  • ఈవీఎంలను ఇప్పటివరకు ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని వెల్లడి
ఈవీఎంల వాడకాన్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాలని, కొంత మేర ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని, మనుషులు కానీ, ఏఐ టూల్స్ తో కానీ ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో దుమారం రేపుతున్నాయి. మస్క్ వ్యాఖ్యలను విపక్షాలు ఓ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్ లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ ల వంటివని, వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎవరినీ అనుమతించరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటున్న ఎలాన్ మస్క్ ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించాలని, ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు ఆయనకు ఓ అవకాశం ఇవ్వాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలామందికి అవకాశం ఇచ్చిందని, కానీ ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.


More Telugu News