ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి
- జూన్ 24 నుంచి 26 వరకు మూడ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
- జూన్ 24న ప్రొటెం స్పీకర్ ఎన్నిక
- అనంతరం నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 26తో ఈ సమావేశాలు ముగుస్తాయి.
రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం జరగాల్సి ఉంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19 నుంచి నిర్వహించాలని భావించారు. అయితే, గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవుల్లో ఉండడంతో, ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి జరపాలని నిర్ణయించారు.
ఈ నెల 24న ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకుంటారు. అనంతరం కొత్త ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా, ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్నపాత్రుడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపై కూటమి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.