వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు

  • 2014లో దర్శి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధా రాఘవరావు
  • నాడు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు 
  • 2019లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి
  • 2020లో వైసీపీలో చేరిక
  • ఈ ఎన్నికల్లో దర్శి స్థానం కోరుకున్నప్పటికీ దక్కని వైనం
ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. అయన తన రాజీనామా లేఖను నేడు పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అంతకుమించి లేఖలో మరే విషయం ప్రస్తావించలేదు. 

శిద్ధా రాఘవరావు 2014లో టీడీపీ కూటమి గెలిచినప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2019 ఎన్నికల్లో శిద్ధా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన తన కుమారుడు సుధీర్ తో కలిసి వైసీపీలో చేరారు. 

ఈసారి ఎన్నికల్లో శిద్ధా కుటుంబం కోరుకున్న దర్శి స్థానం దక్కకపోగా... అద్దంకి, మార్కాపురం, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను వైసీపీ నాయకత్వం ప్రతిపాదించింది. అయితే వీటి పట్ల శిద్ధా రాఘవరావు ఆసక్తి చూపించలేదు.


More Telugu News