హైద‌రాబాద్‌లో ప‌లుచోట్ల‌ భారీ వ‌ర్షం!



హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం మొద‌లైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం ప‌డుతోంది. పెనుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అమీర్‌పేట, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, లంగర్‌హౌస్‌, గండిపేట, శివరాంపల్లిలో భారీ వర్షం నమోదైంది. అలాగే పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, గచ్చిబౌలి, మణికొండ, షేక్‌పేట, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. 

ఒక్కసారి వర్షం కురవడంతో రోడ్ల‌పైకి వ‌ర‌ద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ప‌డుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఈ వ‌ర‌ద నీటిని తొల‌గించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్న‌ట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఎలాంటి స‌మ‌స్య‌లున్నా 040-21111111, 9000113667కు ఫోన్ చేయాల‌ని తెలిపింది.


More Telugu News