కాన్పు చేసిన ఆర్‌టీసీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస!
- కరీంనగర్ బస్టాండ్‌లో గర్భిణీకి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది
- పత్రికల్లో చీరలు అడ్డుగా కట్టి ప్రసవానికి సహాయం చేశారన్న వార్త చూసిన సీఎం
- ఆ వార్త చూసి 'ఎక్స్' వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి
కరీంనగర్ బస్టాండ్‌లో గర్భిణీకి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. చీరలు అడ్డుగా కట్టి ప్రసవానికి సహాయం చేశారన్న వార్తలు చూసిన సీఎం.. సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. విధి నిర్వహణలోనూ ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్త చూసి ముఖ్యమంత్రి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
కాగా, ఊరికి వెళ్దామని కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చిన గర్భిణీకి ఉన్నట్టుండి పురిటి నొప్పులు మొదలయ్యాయి. అది గమనించిన ఆర్‌టీసీ మహిళా సిబ్బంది వెంటనే చీరలను అడ్డుపెట్టి ఆమెకు ప్రసవం చేశారు. 108 వాహనం వచ్చేలోపే సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. దీంతో వీరిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.