పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై హరీశ్‌రావు ఏమన్నారంటే..!
- బ్రేకింగ్స్, వ్యూవ్స్ కోసం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఫైర్
- ఇకపై తన విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచన
- లేనిపక్షంలో లీగల్ నోటీసులు ఇస్తానంటూ హెచ్చరిక
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణలో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బ్రేకింగ్స్, వ్యూవ్స్ కోసం సోషల్ మీడియా వేదికగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పలురకాలుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు.
తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానని కొందరు రాస్తే, మరికొందరు బీజేపీలోకి చేరుతున్నట్లు, ఇంకొందరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నట్లు తమకు తోచిన విధంగా రాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటి కారణంగా నేత క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై తన విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. తన క్రెడిబిలిటిని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా వెళ్లడం జరుగుతుందని హెచ్చరించారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత రాయాలని తెలిపారు.