సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మిడి సంధ్యారాణి

  • సాలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి
  • ఏపీ మహిళా, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రిగా నియామకం
  • ఐటీడీఏ, ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి 
  • అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని స్పష్టీకరణ
సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణిని మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఆమెకు మహిళా, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఈ నేపథ్యంలో, గుమ్మిడి సంధ్యారాణి నేడు ఏపీ సచివాలయంలోని తన చాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని తెలిపారు. గిరిజన పాఠశాల్లో డ్రాప్ అవుట్లను నివారిస్తామని చెప్పారు. ఐటీడీఏ, ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడించారు.


More Telugu News