బార్బడోస్‌లో చొక్కాలు విప్పేసి.. బీచ్ వాలీబాల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు.. ఇదిగో వీడియో!
- జూన్ 20న బార్బడోస్‌లో ఆఫ్గనిస్థాన్‌తో తలపడనున్న భారత్
- ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత ప్లేయర్లు
- సరదాగా బీచ్ వాలీబాల్ ఆడుతూ కనిపించిన వైనం
- అలా ఆటగాళ్లు సరదాగా బీచ్ వాలీబాల్ ఆడిన వీడియోను 'ఎక్స్' ద్వారా పంచుకున్న బీసీసీఐ
టీ20 వరల్డ్‌కప్ 2024లో లీగ్ దశ మ్యాచులు ముగిశాయి. దీంతో తదుపరి దశకు చేరిన ఎనిమిది జట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆ ఎనిమిది జట్లు ఇప్పుడు రెండు గ్రూపులుగా విడిపోయి తమ తదుపరి మ్యాచులను ఆడనున్నాయి. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు ఈ సూపర్-8 మ్యాచులు జరగనున్నాయి. ఇక గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.
దీంతో సూపర్-8లో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 20న బార్బడోస్‌లో తన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత ప్లేయర్లు సరదాగా గడుపుతున్నారు. తాజాగా బీచ్ వాలీబాల్ ఆడుతూ కనిపించారు. విరాట్ కోహ్లీ, హర్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, శివం దూబే, యజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ తదితర టీమిండియా ఆటగాళ్లు ఇలా సరదాగా బీచ్ వాలీబాల్ ఆడారు.
దీని తాలూకు వీడియోను బీసీసీఐ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆఫ్గన్‌తో మ్యాచ్ తర్వాత భారత జట్టు వరుసగా జూన్ 22న ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో, జూన్ 24న సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. టీమిండియా మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.