ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- నేడు బక్రీద్ పండుగ
- త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ పండుగ అని అభివర్ణించిన పవన్ కల్యాణ్
- ముస్లింలందరికీ భగవదనుగ్రహం కలగాలని ఆకాంక్ష
నేడు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ పండుగ అని అభివర్ణించారు. ప్రతి పండుగలోనూ గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత ఉంటాయని అన్నారు. ఇస్లాం మతంలో విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారో, బక్రీద్ పండుగను కూడా అంతే నిష్ఠగా జరుపుకుంటారని వివరించారు.
ప్రవక్త మహ్మద్ త్యాగనిరతిని స్మరించుకుంటూ నిర్వహించుకునే ఈ పండుగ ముస్లింలందరికీ భగవదనుగ్రహం కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర కూడా ప్రారంభమయ్యే ఈ శుభ దినాల్లో ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.