స‌చివాల‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఛాంబ‌ర్ కేటాయింపు

  • రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో నం. 212 గ‌ది ప‌వ‌న్ కు కేటాయింపు
  • జ‌న‌సేన మంత్రులు నాదెండ్ల, దుర్గేశ్‌కు కూడా అదే అంత‌స్తులో ఛాంబ‌ర్లు
  • ప‌క్క‌ప‌క్క‌నే ప‌వ‌న్‌, నాదెండ్ల‌, దుర్గేశ్ ఛాంబ‌ర్లు
  • ఎల్లుండి మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న ప‌వ‌న్ క‌ల్యాణ్
స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఛాంబ‌ర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని ఆయ‌న కోసం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌సేన మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంత‌స్తులో ఛాంబ‌ర్లు కేటాయించారు. దీంతో ఈ ముగ్గురు ప‌క్క‌ప‌క్క గ‌దుల్లోనే త‌మ విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. 

ఇక ప్ర‌స్తుతం ఆయా ఛాంబ‌ర్ల‌లో ఫ‌ర్నిచ‌ర్‌, ఇత‌ర సామగ్రిని అధికారులు స‌మ‌కూర్చే ప‌నిలో ఉన్నారు. కాగా, ఎల్లుండి మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 

కాగా, చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్‌ను ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది.


More Telugu News