పోలవరానికి చేరుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరానికి చేరుకున్నారు. అనుకున్నట్టుగానే ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు నేరుగా పోలవరం సందర్శించారు.
స్పీల్‌వే, కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరిగి రానున్నారు.
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరుల శాఖాధికారులతో సమావేశమై పోలవరం పురోగతి గురించి అడిగారు. వారు ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని చంద్రబాబు నేరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామన్నారు.