రుషికొండ ప్యాలెస్ నుంచి బయటకు రావాల్సిన ఫొటోలు చాలానే ఉన్నాయి: లోకేశ్

  • బక్రీద్ సందర్భంగా మంగళగిరిలో ముస్లింలతో కలిసి లోకేశ్ ప్రార్థనలు
  • తాము అధికారంలోకి వచ్చాక కూడా ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హతమార్చారని ఆగ్రహం
  • చంద్రబాబు ఆదేశాల వల్లే సంయమనం పాటిస్తున్నామన్న మంత్రి
రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన ఫొటోలు చాలానే ఉన్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బక్రీద్ సందర్భంగా సోమవారం మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్న లోకేశ్ ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. 

అనంతరం మాట్లాడుతూ.. రాబోయే వంద రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారని, అయినప్పటికీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దన్న సీఎం ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నట్టు చెప్పారు. 

ప్రజాదర్బార్‌ను అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా, గత రెండు రోజులుగా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. అందరి సమస్యలను ఓపిగ్గా వింటున్న లోకేశ్.. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి భరోసా ఇస్తున్నారు.


More Telugu News