రేణుకస్వామికి కరెంట్ షాక్ ఇచ్చి.. చిత్రహింసలు పెట్టి చంపేశారు.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు

  • కన్నడ పాప్యులర్ నటుడు దర్శన్ ఫ్యాన్‌ క్లబ్‌లో రేణుకస్వామి సభ్యుడు
  • పవిత్రగౌడకు బెదిరింపు మెసేజ్‌లు పంపాక కిడ్నాప్
  • ఆపై బెంగళూరులో లభ్యమైన మృతదేహం
  • ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడ సహా 17 మంది అరెస్ట్
కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీప అభిమాని రేణుకస్వామి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రేణుకస్వామిని హత్య చేయడానికి ముందు కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేసినట్టు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. కన్నడ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసిన ఈ హై ప్రొఫైల్ కేసులో ఇప్పటి వరకు  నటుడు దర్శన్, సహనటి పవిత్ర గౌడ సహా పోలీసులు 17 మందిని అరెస్ట్ చేశారు.  

ఈ కేసులో పోలీసులు తాజాగా మాండ్యాకు చెందిన కేబుల్ ఆపరేటర్ ధన్‌రాజ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. ధన్‌రాజ్‌కు ఫోన్ చేసిన మరో నిందితుడు నందీశ్ బెంగళూరులోని ఓ గోడౌన్‌కు రప్పించాడు. రేణుకస్వామికి అక్కడే ఎలక్ట్రికల్ మెగ్గర్‌తో కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేశారు. రేణుకస్వామికి షాక్ ఇచ్చేందుకు ఉపయోగించిన పరికరాన్ని పోలీసులు సీజ్ చేశారు. 

ఆటో డ్రైవర్ అయిన రేణుకస్వామి చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్ క్లబ్‌లో సభ్యుడు కూడా. పవిత్ర గౌడకు బెదిరింపు మెసేజ్‌లు పంపిన తర్వాత జూన్ 8న స్వామి కిడ్నాప్ అయ్యాడు. ఆ తర్వాత అతడి మృతదేహం బెంగళూరు సమీపంలో లభ్యమైంది.


More Telugu News