అంతా అయిపోయాక రాణించిన పాక్ బౌలర్లు!
- టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పాక్ జట్టు
- గ్రూప్-ఏ నుంచి సూపర్-8 దశకు అర్హత సాధించిన భారత్, అమెరికా
- నేడు నామమాత్రపు మ్యాచ్ లో పాక్ × ఐర్లాండ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు చేసిన ఐర్లాండ్
టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ జట్టు ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. గ్రూప్-ఏలో టీమిండియా, ఆతిథ్య అమెరికా జట్లు సూపర్-8 దశకు అర్హత సాధించాయి. గ్రూప్-ఏలో ఇవాళ నామమాత్రపు మ్యాచ్ లో పాక్ జట్టు ఐర్లాండ్ తో ఆడుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ పోరులో పాక్ బౌలర్లు సత్తా చాటారు. దాంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో షహీన్ అఫ్రిది దెబ్బకు ఐర్లాండ్ 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో గారెత్ డెలానీ 31, జాషువా లిటిల్ 22 పరుగులు చేశారు. టాపార్డర్ లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3, ఇమాద్ వాసిం 3, మహ్మద్ అమీర్ 2, హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశారు.