పవన్ కల్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణ ఎప్పుడంటే...!

  • ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ నియామకం
  • పవన్ కు పలు శాఖల కేటాయింపు
  • జూన్ 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్న జనసేనాని
జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులైన సంగతి తెలిసిందే. ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. 

కాగా, పవన్ కల్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19న పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు రాగా, వైసీపీకి 11 స్థానాలు దక్కాయి. 

ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 24 మంది ప్రమాణం చేశారు. మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు.


More Telugu News