ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

  • ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో ఘర్షణలు
  • అప్పటి ఎస్పీ బిందు మాధవ్ పై ఈసీ సస్పెన్షన్ వేటు
  • ఘటనలపై వివరణ ఇచ్చిన బిందు మాధవ్
  • సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
ఎన్నికల వేళ ఈసీ వేటుకు గురైన ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్ కు ఊరట లభించింది. ఆయనపై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ ను వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎన్నికల సమయంలో బిందు మాధవ్ పల్నాడు ఎస్పీగా ఉన్నారు. అయితే పల్నాడులో ఘర్షణలు జరగడంతో బిందు మాధవ్ ను ఈసీ సస్పెండ్ చేసింది. జరిగిన ఘటనలపై బిందు మాధవ్ వివరణ ఇచ్చారు. బిందు మాధవ్ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఏపీ సర్కారు ఆయనను మళ్లీ విధుల్లోకి తీసుకుంది. ఆయనకు తదుపరి పోస్టింగ్ వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News