రేపు పోలవరం వెళ్లనున్న చంద్రబాబు
- ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
- క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం
- పోలవరంతో తొలి పర్యటన షురూ
ఏపీ నూతన సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా రేపు (జూన్ 17) పోలవరం వెళుతున్నారు.
2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గానీ, పోలవరంకు సంబంధించి సమీక్ష గానీ జరిగేవి. ఇప్పుడు కూడా అదే ఆనవాయతీ కొనసాగించాలని నిర్ణయించారు.
రేపు సోమవారం ఉదయం 9.30 సీఎం చంద్రబాబు పోలవరం చేరుకోనున్నారు. ప్రాజెక్టులోని అన్ని విభాగాలను పరిశీలించి, పోలవర ప్రాజెక్టు అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.