ఈవీఎంలపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ స్పందన

  • ఈవీఎంలను కొంతమేర హ్యాక్ చేసే అవకాశముందున్న ఎలాన్ మస్క్
  • ఈవీఎంలను బహిష్కరించాలని పిలుపు
  • భారత్ లోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్ ల వంటివి అంటూ రాహుల్ ట్వీట్
  • కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా అనుమతించరని వెల్లడి
ఈవీఎంలను కొంతమేర హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని, ఈవీఎంలను బహిష్కరించాలని వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 

భారత్ లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ ల వంటివని, కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరికీ అనుమతి ఇవ్వరని ఆరోపించారు. ఇలాంటివి చూస్తుంటే మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రస్థాయిలో సందేహాలు కలుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగానే మిగిలిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతేకాదు, మొబైల్ ఫోన్ సాయంతో ఈవీఎంను హ్యాక్ చేసిన ఆరోపణలపై ముంబయి ఎంపీ బావమరిది మీద కేసు నమోదైన వార్తా క్లిప్పింగ్ ను కూడా రాహుల్ తన ట్వీట్ కు జత చేశారు.


More Telugu News