ఐస్‌క్రీమ్‌లో జెర్రి.. విస్మయం కలిగించే ఘటన
- ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన నోయిడా మహిళకు షాక్
- సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేసిన కస్టమర్
- డబ్బులు తిరిగిచ్చేసిన డెలివరీ కంపెనీ.. స్పందించని తయారీ కంపెనీ
ఇటీవల ముంబై నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ ఆర్డర్ తెప్పించుకున్న ఐస్‌క్రీమ్ కోన్‌లో మనిషి వేలిని గుర్తించిన షాకింగ్ ఘటనను మరువక ముందే ఇదే తరహాలో మరో నిర్ఘాంతపోయే ఘటన వెలుగుచూసింది. ఎంతో ఇష్టమైన, రుచికరమైన ఆహారాన్ని తినడానికి సిద్ధమై మూత తీసి చూశాక అందులో జెర్రి ఉంటే ఎలా ఉంటుంది?.. ఊహించడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మహిళకు నిజంగానే ఈ పరిస్థితి ఎదురైంది.
నోయిడాకు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్న ఐస్‌క్రీమ్ టబ్‌లో ఒక జెర్రి కనిపించింది. గడ్డకట్టి చనిపోయి ఉన్న జెర్రి మూతకు అతుక్కొని ఉంది. దీప అనే మహిళకు జూన్ 15న ఈ అనుభవం ఎదురైంది. తన పిల్లల కోసం ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓ ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కు చెందిన ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించింది. ఐస్‌క్రీం బాక్స్ తెరవగానే అందులో గడ్డకట్టి ఉన్న జెర్రికి సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
కాగా ఐస్‌క్రీమ్‌ను డెలివరీ చేసిన ప్లాట్‌ఫామ్ డబ్బులను తిరిగి చెల్లించిందని బాధిత మహిళ దీప తెలిపింది. కానీ ఐస్‌క్రీమ్ బ్రాండ్ కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని దీప పేర్కొంది.