రైల్లో అగ్ని ప్రమాదం వదంతి.. చాయ్‌వాలా అప్రమత్తతో తప్పిన ప్రమాదం
- ఝార్ఖండ్‌లోని ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం వదంతి వ్యాప్తి
- భయపడ్డ ప్రయాణికులు రైలు నుంచి దూకేసిన వైనం
- పక్క ట్రాక్ మీద వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ముగ్గురి దుర్మరణం
- మిగిలిన వారు కిందకు దూకబోతుండగా అడ్డుకుని కాపాడిన చాయ్‌వాలా
రైల్లో అగ్ని ప్రమాదం జరిగిందన్న వదంతితో భయపడ్డ కొందరు కిందకు దూకేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకుని ప్రాణాలను కాపాడాడో చాయ్‌వాలా! ఝార్ఖండ్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతంలో చాయ్‌వాలాపై ప్రశంసలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి రాంచీ నుంచి సాసారం (బీహార్) వెళుతున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కుమండీహ్ సమీపానికి రాగానే మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతిని నమ్మి కొందరు ప్రయాణికులు కిందకు దూకేశారు. అదే సమయంలో పక్క ట్రాక్ మీద నుంచి వస్తున్న రైలును ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే, మరికొందరు ప్రయాణికులు ఇలాగే కిందకు దూకబోతుండగా అదే బోగీలో ఉన్న చాయ్ వాలా వారిని అడ్డుకుని ప్రాణాలు కాపాడాడు. మృతుల సంఖ్య పెరగకుండా అడ్డుకున్నాడు. రాత్రి వేళ చిమ్మచీకటి కారణంగా తమను కాపాడింది ఎవరో కూడా ప్రయాణికులకు తెలియరాలేదు. ఆ తరువాత జరిగింది తెలిసి ఆశ్చర్యపోయారు. అయితే, అగ్నిప్రమాదం వదంతిని వ్యాప్తి చేసింది ఎవరో మాత్రం ఇంకా తెలియరాలేదు.