వెడ్డింగ్ డే స్పెషల్... అందమైన ఫొటో పంచుకున్న ఉపాసన

  • జూన్ 14న రామ్ చరణ్, ఉపాసనల పెళ్లిరోజు
  • నేడు ఆసక్తికరమైన ఫొటో పోస్టు చేసిన ఉపాసన
  • 2012లో పెళ్లితో ఒక్కటైన రామ్ చరణ్, ఉపాసన
  • గతేడాది జూన్ లో క్లీంకార జననం
జూన్ 14న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు. తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఉపాసన ఒక అందమైన ఫొటోను పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తె క్లీంకారను నడిపిస్తుండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. చరణ్, ఉపాసన అటు తిరిగి ఉండడంతో క్లీంకార ముఖం కనిపించలేదు.

రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్ 14న పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్నటితో వారి వైవాహిక బంధానికి 12 ఏళ్లు నిండాయి. గతేడాది జూన్ 20న ఉపాసన పండంటి ఆడశిశువుకు జన్మనివ్వగా, ఆ పాపకు క్లీంకార అని నామకరణం చేశారు.


More Telugu News