కడపకు చెందిన దివ్యాంగుడికి రూ.3 లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
- చంద్రబాబు 4.0 షురూ
- ఇవాళ ఎన్టీఆర్ భవన్ కు విచ్చేసిన సీఎం చంద్రబాబు
- వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఆలకించిన వైనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4.0 పరిపాలనను షురూ చేశారు. ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు విచ్చేసిన చంద్రబాబు అక్కడ వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలు విన్నారు.
తాజాగా, కడప రాజారెడ్డి వీధికి చెందిన దివ్యాంగుడు కనపర్తి మనోజ్ కుమార్ కు రూ.3 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. వైద్యం కోసం సాయం చేయాలని మనోజ్ కుమార్ సీఎం చంద్రబాబును అర్థించాడు. ఆ దివ్యాంగుడి పరిస్థితి పట్ల స్పందించిన సీఎం చంద్రబాబు... వెంటనే ఆర్థికసాయం ప్రకటించారు.
సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారు
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారైంది. సోమవారం (జూన్ 17) నాడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రిగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరంతో ప్రారంభించనున్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు.