ఆగ‌స్టు 15న 'డబుల్ ఇస్మార్ట్'​.. మరి 'పుష్ప' వెనక్కి వెళ్లిన‌ట్లేనా...?

  • రామ్ పోతినేని, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్'
  • ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా విడుద‌ల తేదీని ఖ‌రారు చేసిన‌ మేక‌ర్స్‌
  • ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయిన‌ 'ఇస్మార్ట్‌ శంకర్' మూవీ 
  • దీంతో సీక్వెల్‌గా వ‌స్తున్న 'డబుల్ ఇస్మార్ట్'పై భారీ అంచ‌నాలు
టాలీవుడ్‌ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్ర‌క‌టించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగస్టు 15వ తేదీన సినిమాను విడుద‌ల చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియ‌జేశారు. 

'ఇస్మార్ట్‌ శంకర్‌'కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. తొలి పార్ట్ సూప‌ర్‌ హిట్ కావడంతో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ సైతం ఈ మూవీపై మరింత దృష్టిసారించిన‌ట్లు స‌మాచారం. రామ్‌తో కావ్య థాప‌ర్ జోడి క‌డుతున్న ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్, శాయాజీ షిండే, గెట‌ప్ శ్రీను త‌దితరులు ఇత‌ర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీని చార్మీ కౌర్, పూరీ జ‌గ‌న్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక, ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప 2' వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ఈ రూమర్స్ గురించి క్లారిటీ రానప్పటికీ... 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ అనౌన్స్ తో 'పుష్ప' సీక్వెల్ వాయిదా పడ్డట్లే అని అర్ధమవుతోంది.


More Telugu News