ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు చేస్తున్నాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- ఏపీ రవాణా మంత్రిగా నియమితులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- నేడు కడపలోని విజయదుర్గ అమ్మవారి ఆలయ సందర్శన
- అమ్మవారికి ప్రత్యేక పూజలు
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని వెల్లడి
- త్వరలోనే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రకటన ఉంటుందని వివరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు కడపలోని విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సందర్శన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు తిన్న సొమ్మంతా కక్కించేంత వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.