పలు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
- విజయవాడలో వ్యవసాయ శాఖ అధికారులతో అచ్చెన్నాయుడు సమావేశం
- ఖరీఫ్ లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదన్న అచ్చెన్న
- క్షేత్రస్థాయిలో ప్రతి అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని స్పష్టీకరణ
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా నియమితులైన కింజరాపు అచ్చెన్నాయుడు నేడు విజయవాడలో తన శాఖపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ నెల 18న రైతులకు పీఎం కిసాన్ నిధులు అందించనున్న నేపథ్యంలో, ఆ అంశంపై కూడా చర్చించారు.
ఖరీఫ్ సీజన్ వస్తున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని మంత్రి అచ్చెన్న వ్యవసాయ శాఖ అధికారులకు నిర్దేశించారు. రైతులకు క్షేత్రస్థాయిలో ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కూడా పాల్గొన్నారు.