విశాఖ మాజీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ పై వైసీపీ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపలేదు?: పీతల మూర్తి యాదవ్

  • గతేడాది జూన్ లో మాజీ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్
  • ఈ ఘటన జరిగి ఏడాది అయిందన్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్
  • నిందితుడు వెంకట్ కు రూ.550 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్న
గతేడాది జూన్ లో విశాఖలో అప్పటి వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కు గురికావడం తెలిసిందే. 

దీనిపై జనసేన నేత, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగి ఏడాదైందని వెల్లడించారు. కిడ్నాప్ పై గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని సూటిగా ప్రశ్నించారు. 

కిడ్నాప్ వ్యవహారంలో నిందితుడు వెంకట్ కు రూ.550 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? నిందితులకు విలువైన భూములు ఎవరిచ్చారు? అని మూర్తి యాదవ్ నిలదీశారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు జీవీ ఇద్దరూ వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారని, ఎన్నారైలకు చెందిన భూములను బెదిరించి రాయించుకున్నారని ఆరోపించారు.


More Telugu News