చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తానన్న కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడు?: టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తానన్న కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడు?: టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు
  • కొడాలి నానిపై కనపర్తి శ్రీనివాసరావు మండిపాటు
  • జగన్ సామాజిక న్యాయం పాటించరని ఎద్దేవా
  • జగన్ తీరు 'వస్తే రాజ్యం.. పోతే సైన్యం'లా అన్నట్టుగా ఉందని విమర్శ
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, ఆయన కాళ్ల వద్ద పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. 

జగన్ ఓ పక్క నా ఎస్సీలు, నా బీసీలు అని జపం చేస్తారని, కానీ రాజ్యసభలో విజయసాయిరెడ్డి, లోక్‌సభ‌లో మిధున్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి, అసెంబ్లీ నేతగా జగన్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. మరి వీటిలో సామాజిక న్యాయం ఎక్కడుందని నిలదీశారు. వస్తే రాజ్యం.. పోతే సైన్యం అన్నట్టుగా జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.


More Telugu News