ఆరెస్సెస్ వర్సెస్ బీజేపీ.. ఇంద్రేశ్ కుమార్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జితన్ రామ్ మండిపాటు
- అహంకారం వల్లే బీజేపీ 240 సీట్లకు పరిమితమైందన్న ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఇంద్రేశ్‌కుమార్
- రాముడిని విశ్వసించని వారు మాత్రం 234 సీట్లు సంపాదించుకున్నారని వ్యాఖ్య
- రాముడు ఎన్డీయేకు అనుకూలంగా తీర్పిచ్చాడన్న జితన్‌రామ్ మాంఝీ
- ఇలా చెప్పే వారు తొలుత తమ గురించి ఆలోచించాలంటూ కౌంటర్
శ్రీరాముడిని పూజించి అహంకారం పెంచుకోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితమైందన్న ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఇంద్రేశ్‌కుమార్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ తీవ్రంగా స్పందించారు. రాముడు ఎన్డీయేకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడని పేర్కొన్నారు. అహంకారం అని చెప్పే వారిని అలాగే సంతోషంగా ఉండనివ్వాలని సూచించారు. ఇలా చెప్పేవారు తొలుత వారి గురించి ఆలోచించాలని బదులిచ్చారు.
జైపూర్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేశ్‌కుమార్ మాట్లాడుతూ.. శ్రీరాముడిని పూజించి అహంకారం పెంపొందించుకున్న పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్లకు మాత్రమే పరిమితమైందని, అయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. శ్రీరాముడిని విశ్వసించని వారు మాత్రం 234 సీట్లు సంపాదించుకున్నారని ఇండియా కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాముడిని పూజిస్తున్నప్పటికీ అహంకారం వల్లే ఓట్లను, అధికారాన్ని దేవుడు అడ్డుకున్నాడని పేర్కొన్నారు. కాగా, అయోధ్యలో ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ లల్లూసింగ్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇంద్రేశ్ కుమార్ వ్యాఖ్యలపై రామజన్మభూమి ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ కూడా స్పందించారు. ఇంద్రేశ్ కుమార్ హిందూ, ముస్లింల ఐక్యత కోసం పనిచేశారని, కానీ అది ఫలించలేదని, ముస్లింలు ఎవరూ బీజేపీకి ఓటు వేయలేదని పేర్కొన్నారు. ఇప్పుడేమో ఆ నెపాన్ని బీజేపీపైకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఎలాంటి అహంకారం లేదన్న ఆయన.. ఇంద్రేశ్ కుమార్ లాంటి ఆరెస్సెస్ వ్యక్తులు ప్రచారంలో ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు.
ఆరెస్సెస్, బీజేపీ మధ్య వివాదంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. ఆరెస్సెస్ నేతలు ఇలాంటివి చెప్పడం వల్ల ఉపయోగం లేదన్నారు. వారు చెప్పేవి ఎవరూ వినిపించుకోరని, మోదీ వారిని పట్టించుకోవడం మానేశారని విమర్శించారు.