పోప్ ఫ్రాన్సిస్ ను భారత్ కు ఆహ్వానించిన ప్రధాని మోదీ
- ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ
- జీ7 దేశాల సదస్సుకు హాజరు
- నేడు పోప్ ఫ్రాన్సిస్ తో భేటీ
ఇటలీలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ... తన పర్యటనలో భాగంగా నేడు పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు. పోప్ ఫ్రాన్సిస్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించి మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.
"జీ7 సదస్సు సందర్భంగా, పోప్ ఫ్రాన్సిస్ ను కలిశాను. మెరుగైన ప్రపంచం దిశగా ఆయన సేవలను, ప్రజల పట్ల ఆయన చిత్తశుద్ధిని నేను అభిమానిస్తాను. భారత్ కు రావాలని పోప్ ఫ్రాన్సిస్ ను ఆహ్వానించాను" అని వెల్లడించారు.
ఇక, ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీని మోదీ కలిసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.