ఉట్కూరు హత్యపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  • ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో భూతగాదాలతో వ్యక్తి హత్య
  • అరాచకాలు, హత్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం ఆదేశాలు
  • శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
  • ఉట్కూరు ఎస్సైని సస్పెండ్ చేసిన అధికారులు
నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగిన హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని... మరో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సంజీవ్‌ను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూతగాదాలే ఈ హత్యకు కారణం.

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అరాచకాలు, హత్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉట్కూరు ఎస్సై సస్పెన్షన్ 

ఉట్కూరు ఎస్సైని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఐజీ సుధీర్ బాబు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణమే స్పందించకపోవడంతో సస్పెండ్ చేశారు. ఎస్సై నిర్లక్ష్యం వల్లనే ఒకరు మృతి చెందారని గ్రామస్థులు ఆరోపించారు.


More Telugu News