మీతో కలిసి పనిచేయనుండడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను: సీఎం చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు
- ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్
- అదనంగా పవన్ కు పలు మంత్రిత్వ శాఖల కేటాయింపు
- పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- వినమ్రంగా బదులిచ్చిన జనసేనాని
ఏపీ క్యాబినెట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు. ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. ఎన్డీయే అగ్రనాయకత్వం మార్గదర్శనంలో, మా మంత్రివర్గ సమష్టి కృషితో సమాజంలోని అన్ని వర్గాలకు పురోగతి, సంక్షేమంతో కూడిన సమగ్రాభివృద్ధి అందించడానికి పాటుపడతాం.
ఈ సందర్భంగా చంద్రబాబు గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శక్తిమంతమైన, సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాకారం చేయాలన్న మన విజన్ కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాను" అంటూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో వివరించారు.