ఆరెస్సెస్‌ను మోదీయే సీరియస్‌గా తీసుకోరు: కాంగ్రెస్ నేత వ్యాఖ్య

  • ఓ పార్టీకి 240, మరో పార్టీకి 234 సీట్లు వచ్చాయని ఆరెస్సెస్ ఇంద్రేశ్ కుమార్ వ్యాఖ్య
  • ఆరెస్సెస్ వ్యాఖ్యలను సీరియస్‌‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
  • వాళ్లు మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉన్నారని వ్యాఖ్య
ఆరెస్సెస్‌ను ప్రధాని నరేంద్రమోదీయే సీరియస్‌గా తీసుకోరని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. అంతకుముందు, ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఇంద్రేశ్ కుమార్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భక్తి చూపి, తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 వద్ద ఆగిపోయిందని, రాముడిని వ్యతిరేకించిన వారు 234 వద్ద నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. ఇంద్రేశ్ కుమార్ వ్యాఖ్యలపై పవన్ ఖేరా స్పందించారు.

ఆరెస్సెస్ వాళ్లు మాట్లాడే మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 'ఆరెస్సెస్‌ను ఎవరు సీరియస్‌గా తీసుకుంటారు. ప్రధాని మోదీయే వారిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇక మేమెందుకు తీసుకోవాలి? అతను (ఇంద్రేశ్ కుమార్) మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడితే అందరూ సీరియస్‌గా తీసుకునేవారు. అప్పుడు మౌనంగా ఉండి... అధికారాన్ని అనుభవించి... ఇప్పుడు మాట్లాడుతున్నార'ని వ్యాఖ్యానించారు.


More Telugu News