అయోధ్య రామాలయానికి ఉగ్రవాద బెదిరింపులు
- రామ మందిరాన్ని పేల్చివేస్తామన్న జైషే ఉగ్రవాద సంస్థ
- ఆడియో సందేశం విడుదల
- అప్రమత్తమైన పోలీసులు... అయోధ్యలో భద్రత కట్టుదిట్టం
- 2001లోనూ అయోధ్యలో పేలుడుకు పాల్పడిన జైషే
అయోధ్యలోని సుప్రసిద్ధ రామాలయానికి ఉగ్రవాద బెదిరింపులు వచ్చాయి. అయోధ్య రామ మందిరాన్ని కూల్చివేస్తామని పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ఆడియో సందేశాన్ని వెలువరించింది.
జైషే సంస్థ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయోధ్య రామాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర భద్రతా సంస్థలు కూడా అప్రమత్తం అయ్యాయి.
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ 2001లోనూ ఇక్కడి రామ మందిరం వద్ద దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలు నింపిన జీపుతో మందిరం వద్ద దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో, జైషే మహ్మద్ ఆడియో హెచ్చరికను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.