ఈ స్కూల్ పిల్లల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది: రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

  • మగ్దంపూర్ హైస్కూల్ పిల్లలు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా స్కూల్‌కు వెళ్తున్నారన్న సీఎం
  • ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంతో వారు సంతోషంగా ఉన్నారని వెల్లడి
  • విద్యార్థినులు ఆధార్ కార్డులు చూపిస్తున్న ఫొటోను ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా స్కూల్‌కు వెళ్తున్న పిల్లలను చూస్తుంటే తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దుంపూర్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉందని... గ్రామానికి కిలో మీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వారు వెళ్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం వల్ల తాము ఉచితంగా బస్సెక్కి స్కూల్‌కు వెళ్తున్నామని విద్యార్థినులు తమ చేతిలోని ఆధార్ కార్డులు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఈ ఫొటోలు తీసి పంపించారని పేర్కొన్నారు.


More Telugu News