టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. సూపర్-8కి ఆఫ్గనిస్థాన్!
- పాపువా న్యూగినీపై ఆఫ్గనిస్థాన్ ఘన విజయం
- సూపర్-8లోకి ఎంట్రీ
- గ్రూప్-సీ నుంచి ఇప్పటికే సూపర్-8కి అర్హత సాధించిన ఆతిథ్య విండీస్
టీ20 వరల్డ్‌కప్‌లో మరో పెను సంచలనం నమోదైంది. పసికూన ఆఫ్గనిస్థాన్ సూపర్-8లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్-సీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో పాపువా న్యూగినీపై ఆఫ్గనిస్థాన్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఆఫ్గాన్ జట్టు సూపర్ 8కు దూసుకెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినీ జట్టు 95 పరుగులు చేసింది. కిప్లిన్ డొరిగా 27తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫరూకీ 3 వికెట్లు, నవీన్ఉల్ హక్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశారు. ఈ లక్ష్యాన్ని ఆఫ్గన్ టీమ్ 15.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచులో ఆఫ్గన్ బ్యాటర్ గుల్బదీన్ నైబ్ 49 పరుగుల (నాటౌట్) తో రాణించాడు.
దీంతో గ్రూప్-సీ నుంచి వెస్టిండీస్ తో పాటు ఆఫ్గన్ కూడా సూపర్-8కి దూసుకెళ్లింది. ఇక న్యూజిలాండ్, ఉగాండా, పాపువా న్యూగినీ ఇంటిముఖం పట్టినట్లే. ఇప్పటివరకు కివీస్ తాను ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచిన న్యూజిలాండ్‌కు తదుపరి దశకు చేరే అవకాశం లేదు. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించిదనే చెప్పాలి.