తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ

  • ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సుజుకి హిరోషి
  • తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై ఇద్దరిమధ్య చర్చ
  • ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జపాన్ రాయబారి సుజుకి హిరోషి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతారంగాలు, ఉపాధి కల్పన తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జపాన్ రాయబారి మర్యాదపూర్వకంగా తనను కలిసినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన కమ్మ సామాజికవర్గ ప్రతినిధులు

అంతకుముందు, తెలంగాణ కమ్మ సామాజికవర్గం ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. కమ్మ కార్పోరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తమ సామాజికవర్గ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గ ప్రతినిధుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


More Telugu News