ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురు

  • వైసీపీ ప్రభుత్వానికి అనుచిత లబ్ధి చేకూరేలా మద్యం విధానం
  • వాసుదేవరెడ్డిపై ఆరోపణలు
  • ఇటీవల వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు
  • ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వాసుదేవరెడ్డి
  • వాసుదేవరెడ్డి కీలక డాక్యుమెంట్స్ మాయం చేశారన్న సీఐడీ
  • ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి
ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. జూన్ 18 లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. వైసీపీ ప్రభుత్వానికి అనుచిత లబ్ధి చేకూరేలా మద్యం విధానం రూపొందించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవలే సీఐడీ అధికారులు హైదరాబాదులోని వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో, తనను అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు వాసుదేవరెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.

వాసుదేవరెడ్డి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించి కీలక పత్రాలు మాయం చేశారని సీఐడీ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాసుదేవరెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు.


More Telugu News