తమిళిసైపై అమిత్ షా సీరియస్ అయిన ఘటనపై దయానిధి మారన్ స్పందన
- దురదృష్ట ఘటన... ఎవరూ స్వాగతించలేరన్న దయానిది మారన్
- నిర్మల, జైశంకర్ పట్ల ఇలాగే వ్యవహరించగలరా? అని నిలదీత
- తమిళనాడుకు చెందిన నాయకురాలైనంత మాత్రాన ఇలా వ్యవహరిస్తారా? అని ఆగ్రహం
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్రమంత్రి అమిత్ షా మందలించినట్లుగా వీడియోలు, ఫొటోలు లీక్ అయిన ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ స్పందించారు. అమిత్ షాపై ఆయన మండిపడుతూ, ఇది దురదృష్ట ఘటన... ఎవరూ స్వాగతించలేరని ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా పని చేశారని... అలాంటి మహిళా నాయకురాలి పట్ల అమిత్ షా తీరు దురదృష్టకరమన్నారు.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లేదా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పట్ల కూడా అమిత్ షా ఇలాగే వ్యవహరించగలరా? అని ప్రశ్నించారు. తమిళిసై తమిళనాడుకు చెందిన మహిళా నాయకురాలు అయినంత మాత్రాన ఇలా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. ఇది చాలా దారుణమైన అంశమన్నారు.