అమ్మవారి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకున్నాను: నారా లోకేశ్
- ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
- అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి రాక
- చంద్రబాబు కుటుంబానికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు
- లోకేశ్ తో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపిన భక్తులు
సీఎం చంద్రబాబు ఇవాళ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. చంద్రబాబు, నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలకు ఆలయ అధికారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. అధికారులు చంద్రబాబు కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందించి, శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు నారా లోకేశ్ తో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.
కుటుంబంతో కలిసి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నామని పేర్కొన్నారు. ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. తమ పర్యటనకు సంబంధించిన ఫొటోలను కూడా నారా లోకేశ్ పంచుకున్నారు.